
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్: ఇంటర్మీడియట్ పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థిని రాయాల్సిన పరీక్ష కేంద్రానికి బదులు వేరే చోటికి చేరడంతో సమయం లేక పోవడముతో ఆందోళన చెందింది. వెంటనే ఆమె ఆందోళనను గుర్తించిన స్థానిక సీఐ సరైన పరీక్ష కేంద్రానికి తన పోలీసు వాహనంలో చేర్పించి శభాష్ అనిపించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ఇంటర్ విద్యార్థిని జనగామ మండల కేంద్రంలోని ప్రిస్టన్ పాఠశాలకు చేరుకుంది. అసలు ఆమె పరీక్ష రాయాల్సిన కేంద్రం జనగామలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్. ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థిని కంగారు పడుతున్న వేళ, జనగామ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి వెంటనే స్పందించారు. తన పోలీస్ వాహనంలో విద్యార్థినిని ఎక్కించుకొని సకాలంలో సరైన పరీక్ష కేంద్రానికి చేర్చారు. అసలే ఒక నిమిషం ఆలస్యంతో ఇబ్బంది పడుతున్నారని ఇంటర్మీడియట్ బోర్డు గుర్తించి ఐదు నిమిషాల వరకు అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయం సదరు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడినట్లుగా స్థానికులు పేర్కొన్నారు. అయితే సకాలంలో తన వాహనంలో పరీక్ష కేంద్రానికి విద్యార్థినిని చేర్చిన సిఐ దామోదర్ రెడ్డిని పలువురు విద్యార్థులు అభినందనలతో ముంచెత్తారు.
