
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హైదరాబాద్ లో జరిగిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల వన్నారం గ్రామానికి చెందిన పోలాడి రామారావు తమ్ముడు పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ వేడుకలు రంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇనగాల పెద్ది రెడ్డి, మాజీ శాసనసభ్యులు వొడితల సతీశ్ బాబు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, రేగులపాటి రమ్యారావు, పిట్టా శ్రీనివాస్ రెడ్డి, బుట్టంగారి మాధవరెడ్డి, కొట్టెం మధుసూదన్ రెడ్డి, విశ్వేశ్వర్ రావు, మన్మదరెడ్డి లతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు, వివిధ ప్రజాసంఘాల, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





