
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి గుడిలోని హుండీ శుక్రవారం విప్పగా రూ.51,130/-రూపాయలు వచ్చినవని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈలెక్కింపులో హాజరైన సభ్యులు పి సత్యనారాయణ పరిశీలకులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్, కే సుధాకర్ కార్యనిర్వాహణాధికారి, ఆలయ చైర్మన్ కొలిపాక శంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు మాచర్ల నరేష్, గాలిబు రాజేందర్, ఎర్ర మధులత, పున్నం చందర్, ఆలయ అర్చకులు అవధానుల భాస్కర్ శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


