
–ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి-ప్రతాప తిరుమల్ రెడ్డి
–మహిళాప్రజాప్రతినిధులను,మహిళలకు సన్మానం
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని, మంచి ఆహారం, స్వచ్ఛమైన నీరు తీసుకోవాలని 4వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రతాప తిరుమల్ రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌన్సిలర్ తిరుమల్ రెడ్డి స్వగృహం నందు శ్రీరామ హాస్పిటల్ సహకారంతో జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్టు శ్రీకర్ మోడెపు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైద్యురాలు మౌనిక, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు సందర్శించారు. ఉచిత వైద్య శిబిరాన్ని తిరుమల్ రెడ్డి ప్రారంభించగా వైద్యులు షుగర్, బీసీ, అవసరమున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసిన శ్రీరామ హాస్పిటల్ యాజమాన్యాన్ని, వైద్యులను తిరుమల్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది బాగుంటుందని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మంచి ఆహారం, స్వచ్ఛమైన నీరు తీసుకోవాలన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం మున్సిపల్, మాజీ చైర్మన్ గందె రాధికతో పాటు పలువురు మహిళలను, ఆస్పటల్ యాజమాన్యం, వైద్యులను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం నంభి భరణికుమార్, ముష్కె శ్రీనివాస్, పూరి, సిబ్బంది ఐషు, అంజలి, సునీత, దీపిక, సంధ్య, సతీష్, నిఖిల్ రెడ్డి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.


