
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మహిళా సాధికారత కోసం అహర్నిశలు కష్టపడుదామని ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ..అమ్మ లేకుంటే జననం లేదు, భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు, అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, ప్రాణం పోసే దేవుడు కూడా కనబడకుండా ఉంటాడమే కాని ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లి మాత్రం తన ప్రాణం ఉన్నంతవరకు బిడ్డ కోసం తపిస్తూనే ఉంటుందన్నారు. సృష్టికి ప్రతిసృష్టి నిచ్చి సమాజముకు దిశ నిర్దేశం చేసే వారే మహిళా మూర్తులు అన్నారు. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే ఇంటి ఇల్లాలైన ప్రతి మహిళ ఆర్ధికంగా బలపడి, ముఖంలో చిరు నవ్వుతో సమాజంలో గౌరవంగా బ్రతకాలన్నారు. మహిళా సాధికారత కోసం అహర్నిశలు కష్టపడుదామని, మహిళా మణులందరికీ ప్రజాసంఘాల సమాఖ్య తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
