
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాత్రి జరిగిన కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండల వన్నారం గ్రామానికి చెందిన ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు సోదరుడైన పోలాడి లక్ష్మణ్ రావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలను వారి కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు, వివిధ ప్రజాసంఘాల బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు, ఉన్నత అధికారులు, ఉద్యోగ, విద్యార్థి, రైతు సంఘాల ఐకాస నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.


