
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం హుజురాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల్లో ఉన్నత స్థానం పొందిన ఉద్యోగులను, మహిళా పోలీసులను రాజకీయ నాయకురాళ్లను, మహిళా కార్మికురాళ్లను శాలువలతో ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ పట్టణంలోని హుజురాబాద్ క్లబ్లో బాలవికాస ఆధ్వర్యంలో, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఆధ్వర్యంలో, హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో సిఐ తిరుమల్ గౌడ్ ఆధ్వర్యంలో, సీఎస్ఐ చర్చ్ లో పాస్టర్ ఆధ్వర్యంలో, హుజురాబాద్ కోర్టులో న్యాయమూర్తుల ఆధ్వర్యంలో, టాప్రా ఆధ్వర్యంలో, మధురమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో, బాలికల పాఠశాలలో, డిగ్రీ కళాశాలలో మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ…మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, మహిళలు తల్లిగా చెల్లిగా భార్యగా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళుతుందని అన్నారు. మహిళ లేని సమాజం ను మనం ఊహించుకోవడం కష్టమని అన్నారు. ఎన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న అలుపెరుగకుండా మహిళలు తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కిరణ్ కుమార్, అలేఖ్య, స్వాతి, పద్మ సాయి శ్రీ, ఏ సిపి శ్రీనివాస్ జి, సీఐ తిరుమల గౌడ్, కమిషనర్ సమ్మయ్య మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, ఏఎస్సై కమల, మాజీ కౌన్సిలర్లు రమాదేవి లావణ్య, హెచ్ఎం తిరుమల, ప్రిన్సిపాల్ ఇందిరా దేవి, స్వరూప రాణి, ఝాన్సీ, ఆసియా, ఖాజాబీ, చందుపట్ల జనార్ధన్, జగదీశ్వర్, సొల్లు సునీత, యేముల పుష్పలత, వర్డినేని రవీందర్రావు, అనురాధ, జ్యోతి రాణి, పులుగు లతారెడ్డి, సొల్లు బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే వాసవి వనిత క్వీన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా క్లబ్ మహిళా మణులని సత్కరించడం జరిగింది. సర్వీస్ కింద ఒక పేద మహిళకి ఒక చీర ఇచ్చి సన్మానించడం జరిగింది. వాసవి వనిత క్వీన్స్ ZC నంగునూరి శైలజ, ప్రెసిడెంట్ Dr అర్చన నార్ల, సెక్రటరీ శివనాథుని స్వప్న, ట్రెజరర్ చీకోటి త్రివేణి మరియు క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత గారి ఆధ్వర్యంలో ఈరోజు హుజురాబాద్ బస్టాండ్ ఆవరణంలో మహిళ ప్రయాణికులతో బస్సులో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది. మహిళ ప్రయాణికులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు పుల్ల రాధ, ఇల్లంతకుంట మండల అధ్యక్షురాలు కోడెం రజిత ఉపాధ్యక్షురాలు సొల్లు సునీత చేపక మల్లేశ్వరి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ చైన్ సెక్రెటరీ మానస తదితర మహిళ ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
డాక్టర్.ఎన్ రమేష్ ఆస్పత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు…హాస్పటల్ మహిళ సిబ్బందితో కేక్ కటింగ్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ మార్చి 08: హుజూరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్లో గల ఎన్ రమేష్ హాస్పిటల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్. ఎన్.రమేష్ హాస్పిటల్ సిబ్బందితో పాటు కేక్ కట్ చేయడం జరిగినది. అలాగే వారు మాట్లాడుతూ.. సృష్టికి మూలం మహిళ ఆమె శక్తియుక్తులు అపారం, ఆమె ఓప్రేరణ, ఓలాలన, స్త్రీ లేకుంటే ఈ సృష్టి లేదు. దానికి గమ్యం, గమనం లేదు.. మనిషికి జీవం, జీవితమే లేదు.. స్త్రీ లేకుంటే అంతా శూన్యం అని అన్నారు. అందుకే స్త్రీలకు శతకోటి వందనాలు, అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టిస్తున్నారు. అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా..ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూడడం లేదు. ఆకాశం, అవకాశాల్లో సగంగా అంటూ, ముందం జలో దూసుకుపో తున్న స్త్రీమూర్తులెందరో వంట గదికే ఆమెను అంకితం చేద్దామని చూస్తే అంతరిక్షంలో దూసుకెళ్లింది. వాకిలి దాటొద్దని ఆంక్షలు పెడితే ఆవలి హద్దులు దాటి అవనిని జయించింది. అణచివేత నుంచి ఆత్మ విశ్వాసం వైపు పయనించిందని అన్నారు. వంటింటి నుంచి విశ్వానికి ఎదిగింది. ఆమె ప్రస్థానం అంతా ఇంతా కాదు.. ఏ రంగమైనా నేనే మేటి అని నిరూపిం చిన తెగువ, తెలివి స్త్రీలది అన్నారు. నేడు ఆమె పండుగ అదే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని డాక్టర్ రమేష్ కొనియాడారు.
బాలవికాస ఆధ్వర్యంలో…
హుజురాబాద్ మండలంలోని హుజురాబాద్ క్లబ్ ఆవరణంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో క్లబ్ క్లబ్ ఓనర్ రవీందర్ రావు మరియు ఏఎస్ఐ కమల, ఉమెన్ హ్యూమన్ రైట్స్ నేత పులుగు లత, మాజీ చైర్మన్ గందె రాధిక మరియు గవర్నమెంట్ టీచర్ అనురాధ, మాజీ కౌన్సిలర్ రమాదేవి ,మాజి కౌన్సిలర్ లావణ్య, ఆయుర్వేద వైద్యురాలు కొటోజు జ్యోతిరాణి, సామాజిక వైద్య సేవ కార్యక్రమం చేసే రేణుక, డాక్టర్ అర్చన, హెల్త్ డిపార్ట్మెంట్ సుజాత, హుజురాబాద్ సెంటర్ మేనేజర్ ఖాజాబీ, రజిత, కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన మహిళల మహిళలందరికీ సంతోషంగా ఆటలు పాటలు ఉమెన్స్ డే ప్రత్యేకత నిర్వహించుకొని గెస్ట్ ల యొక్క అమూల్యమైన సందేశాలను పంచుకోవడం జరిగింది. వచ్చిన గెస్ట్ లందరికీ శాలువా సన్మానం చేయడం జరిగింది. అలాగే బాలవికాస ద్వారా మహిళా వికాస సంఘం ఏర్పడడానికి సహకారం చేసిన విలేజ్ లీడర్స్ కి మరియు వితంతువుగా జీవితాన్ని సక్సెస్ చేసుకున్న మహిళలకు మహిళలకు సన్మానం చేయడం జరిగింది. సందర్భంగా మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు మరి అందరూ భోజనం చేసి చిన్న గిఫ్ట్ తీసుకొని సంతోషంగా వెళ్లడం జరిగింది.
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హుజురాబాద్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి B తిరుమల మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రానిస్తున్నారు. బాలికల బాగా చదివి అన్ని రంగాలలో రానించాలన్నారు. పి ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడి దారి వ్యవస్థ మహిళలనుమార్కెట్ వస్తువుగా మర్చిందని ఎక్కడితే మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామజికంగా అన్నిహక్కులు పొందుతారో అక్కడ నిజమైనా అభివృద్ధి సాధించినట్లు అని అన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సమావేశంలో B తిరుమల HM, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఆసియ, రోజరాణి, అర్చన, అవస్తీ, మాధవిలత, శ్రీలత, శ్రావణి, అనూష, శారద, మారుతీ, ప్రసాద్, శ్రీనివాస్, సదానందంలు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని స్థానిక టిడబ్ల్యూజేఎఫ్ కార్యాలయంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ బీసీ సిటిజన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ పోలీస్ స్టేషన్ హుజురాబాద్ బి కమల హెచ్ ఆర్ సి మెంబర్ ఆఫ్ కరీంనగర్ పులుగు లతా రెడ్డి మరియు లీగల్ సెల్ అసిస్టెంట్ మెంబర్ ఆఫ్ హుజురాబాద్ బూర సరిత గారిని ఘనంగా సన్మానించనైనది ఈ సందర్భంగా టాప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, లీగల్ సెల్ అడ్వైజర్ బీసీ నాయకులు సందేల వెంకన్నలు మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు సాధికారిత సమానత్వం కొరకు శతాబ్దాల పోరాటము చేసినప్పటికీ 19వ శతాబ్దం ప్రారంభములో స్త్రీలు తమ ఓటు హక్కు సాధన కొరకు పురుషులతో పాటు స్త్రీలకు సమాన వేతనము మెరుగైన జీవనం కొరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న సందర్భంగా ఇది గుర్తించిన ఐక్యరాజ్యసమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని వారు తెలిపారు. ఈనాడు స్త్రీలు విద్యా సాంకేతిక రంగాలలో సమానత్వ అవకాశాలు పొందడానికి మూలకారకులైన మరియు స్త్రీ విద్య కొరకు ఎన్నో కష్టాలను నష్టాలను భరిస్తూ అహర్నిశలు పాటుపడిన సావిత్రిబాయి పూలే దుర్గాబాయి దేశముఖ్ సేవలను ప్రతి ఒక్కరూ తమ హృదయములో పదిలపరుచుకొని వారిని అనునిత్యము స్మరించుకోవలసిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా స్త్రీలు ఆ మాతృమూర్తులను ఆదర్శంగా తీసుకొని విద్యా ఉద్యోగము సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ ఆకుల సదానందం, పోలీస్ కానిస్టేబుల్ ఈ రాజిరెడ్డి, టాప్ర హుజురాబాద్ శాఖ అధ్యక్షులు శనిగరం నరేందర్, ట్రెజరరీ మండల వీరస్వామి, దొంత హరికృష్ణ, గాజర్ల బుచ్చిరాజం, బీసీ నాయకులు గరవేన శ్రీకాంత్ ముదిరాజ్, ఆళ్ల కేశవులు, మొలుగూరి కొమురయ్య, రాయబారపు కుమార్ తదితరులు పాల్గొన్నారు.













మహిళను సన్మానిస్తున్న సామాజిక కార్యకర్త వీ రవీందర్ రావు..