
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వాగ్దేవి క్లబ్, కరీంనగర్ ఆధ్వర్యంలో శనివారం వాసవి మాత దేవాలయంలోని వాసవి హాల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది సమాతా రాణి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సాధికారతపై ప్రేరణాత్మకంగా ప్రసంగించారు. అదేవిధంగా, జైన అర్చన (క్యాబినెట్ సెక్రటరీ), ఎల్లంకి ప్రదీప్ (వైస్ గవర్నర్), పబ్బా అరుణ (ఐపీసీ), నాగరాజు (డిస్టిక్ ఇన్చార్జ్ – అవేర్నెస్), పాత రాధా కిషన్ (రీజనల్ చైర్పర్సన్), జిల్లా వేణుగోపాల్ (రీజనల్ సెక్రెటరీ), సూరా గీత (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ – సిఎంఆర్), సామ లక్ష్మణ్ (డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ), కైలాస నవీన్ (డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ), రాచమల్ల గాయత్రి (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ – ఉమెన్ ఎంపవర్మెంట్), ఎలగందుల సౌమ్య (క్యాబినెట్ అదనపు ట్రెజరర్), మాడిశెట్టి ఉమాదేవి (జోన్ చైర్పర్సన్) తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభమై, వాసవి మాత పారాయణం, ప్రత్యేక ప్రార్థనలతో కొనసాగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు రాచకొండ రూపశ్రీ, ప్రధాన కార్యదర్శి రాజమణి, కోశాధికారి గంప హారిని, ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. క్లబ్ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, ప్రేరణాత్మక ఉపన్యాసాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళా సాధికారత, సమానత్వాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుక విజయవంతంగా ముగిసింది. పాల్గొన్న అతిథులు, సభ్యుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం విశేష స్పందన పొందింది.
