
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో ఇండియా జట్టు విజయం సాధించిన సందర్భంగా కరీంనగర్లో బీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బీజేపీ నాయకుడు వంగల పవన్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మీడియా కన్వీనర్ కటకం లోకేష్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, ఉప్పరపల్లి శ్రీనివాస్, శివానందం, నాగసముద్రం ప్రవీణ్, ఈసంపల్లి మహేష్, సురేష్ తదితరులు పాల్గొని, దేశ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. సంబరాల్లో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ, భారత క్రికెట్ జట్టు ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిభను చాటిందని, ఈ గెలుపు దేశాన్ని గర్వించేల చేసిందని హర్షం వ్యక్తం చేశారు.


