
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: చాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు విజయంపై కరీంనగర్ కమిషనరేట్ నందు సంబరాలు జరుపుకుంటున్న క్రికెట్ అభిమానులపై ఎలాంటి లాఠీచార్జి జరగలేదని, సోషల్ మీడియా లో వస్తున్న కథనాలు పూర్తి అవాస్తవమని కరీంనగర్ టౌన్ ఏసిపి వెంకట్ స్వామి స్పష్టం చేశారు. కరీంనగర్ కమీషనరేట్ లో విజబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రధాన కూడళ్ళు జంక్షన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చర్యలు అమల్లో ఉన్న సంగతి విధితమే.
చాంపియన్స్ ట్రోఫీ కొరకు ఆదివారంనాడు జరిగిన క్రికెట్ మ్యాచ్ నందు భారత జట్టు గెలుపొందిన సందర్భంగా కరీంనగర్ గీతాభవన్ చౌక్ నందు కొంతమంది క్రికెట్ అభిమానులు గుంపుగా ఏర్పడి నినాదాలు చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ తరుణంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడినందున, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గుంపుగా ఏర్పడిన క్రికెట్ అభిమానులను ట్రాఫిక్ రెగ్యులరైస్ చేసేందుకు స్నేహపూర్వకంగా మాత్రమే అక్కడి నుంచి పంపించి వేసామని, అక్కడ ఎటువంటి లాఠీచార్జ్ జరగలేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను, అసత్య ప్రచారాలను నమ్మవద్దని టౌన్ ఏసిపి వెంకట్ స్వామి తెలిపారు.
అంతేకాకుండా వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేసే వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు కూడా తీసుకోబడతాయని హెచ్చరించారు.
