
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైదాపూర్ మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన సంత పూరి నిఖిల్ రెడ్డి గ్రూప్ 2లో 70 ర్యాంకు సాధించడంతో గురువారం రోజున బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హుజురాబాద్ పట్టణంలోని బృందావన్ కాలనీలో నివాసముంటున్న నిఖిల్ రెడ్డిని కలిసి అభినందించి, సన్మానించారు. అలాగే కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిఖిల్ రెడ్డి హుజురాబాద్ పట్టణంలో ప్రాథమిక విద్యను, పై చదువుల కోసం హైదరాబాదులో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకుని , గతంలో గ్రూప్ 4 పరీక్షల్లో ఏడవ ర్యాంకు సాధించారని తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్ డిటిఓ కార్యాలయంలో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న నిఖిల్ రెడ్డి , తాజాగా గ్రూప్ 2లో 70 వ ర్యాంకు సాధించడం హర్షనీ యమన్నారు. భవిష్యత్తులో గ్రూప్ 1 సాధించాలనే సంకల్పం నిఖిల్ రెడ్డికి ఉందని, అందులో కూడా విజయం సాధించి మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు బిజెపి సీనియర్ నాయకులు తిప్ప బత్తిని రాజు పోతుల సంజీవ్ బొరగాల సారయ్య సబ్బని రమేష్ గంట సంపత్ గుడిపాటి కొండారెడ్డి హృతిక్ మోతే మోహన్ తదితరులు పాల్గొన్నారు.

