
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన జంగం చందు (24) అని యువకుడు వరంగల్ మిల్స్ కాలనీకి చెందిన గుళ్ళ మహిత (23) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని సోమవారం జమ్మికుంట పోలీసులను ఆశ్రయించారు. చందు, మహితల కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించిన సిఐ వి రవి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మేము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని జీవితాంతం కలిసి ఉంటామని వారు ఇద్దరు ఇటు పోలీసులకు అటు కుటుంబ సభ్యులకు తెలపగా వారిద్దరూ మేజర్లు కాబట్టి చట్టపరంగా నేనేమి చేయలేనని మీరే కూర్చొని మాట్లాడుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు సిఐ తెలిపారు. అనంతరం నూతన దంపతులు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకుందామని అనంతరం ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయామని ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత కలిసిందామని నిర్ణయించుకోగా అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సోమవారం జమ్మికుంట పోలీసులను ఆశ్రయించడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు.







