
స్వర్ణోదయం ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల జీత భత్యాలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సవరించిన జీతభత్యాలు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం..రూ.1.24 లక్షలు, రోజువారీ భత్యం రూ.2500 వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మాజీ ఎంపీ నెలవారీ పెన్షన్ రూ.31 వేలకు కేంద్రం సవరించింది. ఇటీవల కర్నాటక ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే జీతం పెంచింది.
