
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని పెందోట ప్రవీణ్ జ్యువెలరీ షాపులో ఈరోజు మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని మహిళలు పట్టగొలుసులు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. పట్ట గొలుసులు కావాలని షాప్ లోకి వచ్చి పట్ట గొలుసులు చూపిస్తుండగా యజమాని కళ్ళు కప్పి పట్టవలసిన దాచిపెట్టి దొరికిపోయారు. వెంటనే సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందజేసి చాకచక్యంగా వారిని పోలీసులకు అప్పజెప్పడం జరిగింది. అయితే వారికి సంబంధించిన వ్యక్తులు మన హుజురాబాద్ లో తిరుగుతున్నారనీ, వారు ఎవరు ఎక్కడినుండి వచ్చారు వారితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై హుజురాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మహిళా దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
