
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఆస్తిపన్ను వసూలులో 100 శాతం వసూలు చేసిన హుజురాబాద్ మున్సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధులు పొందుటకు అర్హత సాధించిందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కెoసారపు సమ్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు సిబ్బందితో ప్ల కార్డులు ధరించి హర్షం వ్యక్తం చేశారు. కాగా స్వచ్ఛ సర్వేక్షన్ – 2025 కార్యక్రమములో భాగంగా ఇప్పల నర్సింగాపూర్ లోని కంపోస్టు యార్డును కంపోస్టు డెవలప్ మెంట్ అధికారి హేమలత బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తడి పొడి చెత్తలను వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాలు గురించి తడి చెత్త నుండి ఎరువుల తయారీ విధానం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ జి సాంబరాజు కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జె శ్రీకాంత్, ఎండి రషీద్, సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, సిబ్బంది, మెప్మా, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






మున్సిపల్ కమిషనర్ కు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలుపుతున్న కలెక్టర్..