Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక పోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పోచమ్మ దేవాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ సీఐ తిరుమల్ గౌడ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, కమిటీ సభ్యులు ఆయనకు చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సీఐ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ, “ఉగాది అంటేనే కొత్త ఆరంభానికి సంకేతం. ప్రతి ఒక్కరూ సత్సంకల్పాలతో ముందుకు సాగాలి,” అని సూచించారు. ఇలాంటి వేడుకలు ప్రజలను ఐక్యంగా ఉంచే అవకాశం కల్పిస్తాయని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.






