
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రి సమీపాన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి పట్ల గురువారం రాత్రి హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రోవత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపి సంతాపం ప్రకటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ ది హత్య అయితే ప్రభుత్వం వెంటనే సంబంధిత వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకొని, వారిని అరెస్టు చేయాలని అన్నారు. పాస్టర్లపై మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మండల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు నమ్మిండ్ల ఉదయ్ కుమార్ కార్యదర్శి జాన్ ప్రభాకర్ కోశాధికారి సలాది ఇమ్మానుయేల్ దేవదాస్ నవీన్ కుమార్, రాజ్ కుమార్, జాన్, సురేందర్, జకర్య, ఏసుదాసు, దావీదు, ప్రభుదాస్, తిమోతి, డేవిడ్, ప్రవీణ్, పాక సతీష్, భోగం దశరథం, ప్రకాష్, మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








