
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రస్తుతమున్న ఉరుకుల, పరుగుల జీవన విధానంలో యోగ మానసిక ప్రశాంతతకు ఉపయోగపడుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున సాయి రూప ఫంక్షన్ హాల్లో యోగా వాచస్పతి సంపత్ కుమార్ రచించిన 49వ హస్త ముద్రా రత్నాకరం గ్రంథవిష్కరణ అంకితోస్తవ గ్రంథాన్ని కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్ రాంరెడ్డితో పాటు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగా శాస్త్రంలో హస్తముద్రలకు ఒక విశేషమైన స్థానం ఉందని, యోగ చేయడం వల్ల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని అన్నారు. యోగా ముద్రలను ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు రచించిన గ్రంథంలో వివరంగా రాయబడిందని, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ముద్రలను వినియోగించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్, రిటైర్డ్ లెక్చరర్ వోళ్ళల మల్లేశంతో పాటు కాంగ్రస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



యోగా వాచస్పతి సంపత్ కుమార్ రచించిన 49వ హస్త ముద్రా రత్నాకరం గ్రంథవిష్కరణ అంకితోస్తవ గ్రంథాన్ని కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్ రాంరెడ్డితో పాటు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆవిష్కరిస్తున్న దృశ్యాలు.





