
- ఈ నెల 31న ఢిల్లీలో జక్కని సంజయ్ ఆమరణ నిరాహార దీక్ష
– ఢిల్లీ దీక్షకి మద్దతుగా హుజురాబాద్ లో రిలే నిరాహార దీక్ష
రిలే నిరాహార దీక్షని విజయవంతం చేయండి - మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మానం పార్లమెంటులో ఆమోదం పొందేలా భవిష్యత్ కార్యాచరణ కోసం ఈరోజు హుజురాబాద్ లోని బీసీ అజాది ఫెడరేషన్ కార్యాలయం లో బీసీ అజాది ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ అజాది ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. బీసీ అజాది ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడికాల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ రిజర్వేషన్ లో స్థానిక సంస్థల్లో బిసి.లకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లలో 42 శాతం రిజర్వేషన్లు బిల్లు అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీని షెడ్యూల్ 9 లో పొందుపరిస్తే తప్ప న్యాయపరమైన ఇబ్బందులు కాకుండా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేంత వరకు కదల వద్దన్నారు. దీనికి ఉదాహరణగా జయలలిత గతంలో తమిళనాడు బీసీల కొరకు తమిళనాడు నుండి అఖిలపక్షాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలోనే ఉండి ఇక్కడ బిల్లు పాస్ అయ్యేంతవరకు తమిళనాడు బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యేంతవరకు ఇక్కడే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చట్టసభలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యుస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.







