
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని హనుమాన్ మాల ధారణ ధరించిన వ్యక్తి(30-40 వయసు గల) దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్ 27 ఏ 78 44 నంబర్ గల సిటి 100 ద్విచక్ర వాహనదారున్నీ గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ద్విచక్ర వాహనదారుడి తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. ద్విచక్ర వాహనం వెనుక హెడ్లైట్ పై భూమేష్, అమ్మానాన్న అని రాసి ఉంది. హనుమాన్ మారదారుడు కావడంతో అతని వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేవు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ తిరుమల గౌడ్ తెలిపారు. పూర్తి వివరాలు సీసీ కెమెరాల ఆధారంగా రాబట్టే పనిలో పోలీసులు పడ్డారు.








