
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య, సిడిపిఓ సుగుణాలు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని కుమ్మరివాడలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లోని పిల్లలను కేంద్రంలో చేర్పించడానికి అంగన్వాడికే టీచర్లు కృషి చేయాలని ఈ కేంద్రాల ద్వారా మంచి విద్యను అందిస్తున్న విషయాన్ని ప్రచారం చేయాలని అన్నారు. అంతేకాకుండా మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న పొడి చెత్త సేకరణ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కిషన్ రావు, అంగన్వాడి సూపర్వైజర్లు పద్మా, రాజశ్రీ, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.






