Oplus_131072
— ఇంచార్జీ డైరెక్టర్ మధుసూదన్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 04: హుజురాబాద్ పట్టణ విద్యుత్ వినియోగరులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించబడుతుందని ఇంచార్జీ డైరెక్టర్ మధుసూదన్ పేర్కొన్నారు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ హుజురాబాద్ టౌన్ లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా నిర్మించబడిన నూతన సబ్ స్టేషన్ ( కళాశాల గ్రౌండ్ ) గురువారం సాంకేతికంగా ఛార్జ్ చేయబడింది. ఈ సబ్ స్టేషన్ (కళాశాల గ్రౌండ్ ) ను ఇంచార్జీ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి. మధుసూదన్ ప్రారంభించారు. కరీంనగర్ సూపరిండెంట్ ఇంజనీర్ రమేష్ బాబు చే అధ్యక్షన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జీ డైరెక్టర్ (ఆపరేషన్స్) టి మధుసూదన్ మాట్లాడుతూ ఈ సబ్స్టేషన్ ప్రారంభం ద్వారా హుజురాబాద్ పట్టణ విద్యుత్ వినియోగరులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిచగలుతుతామని అన్నారు. ఓల్టేజ్ సమస్యలు ఇక ఉండవని, విద్యుత్ అంతరాయాలు కనిష్ట స్థాయికి వస్తాయని తెలిపారు. ఈ కొత్త సబ్స్టేషన్ ప్రారంభంతో హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని, పరిశ్రమలు, విద్యా సంస్థలు, వ్యాపార వృద్ధికి ఊతమిస్తుంది తెలిపారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా హుజురాబాద్ పట్టణంకు మేలు జరుగుతుందని, ఓవర్ లోడ్ సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి డిఈ హుజురాబాద్, చంద్రమౌళి డిఈ కన్స్ట్రక్షన్, కాళిదాస్ డిఈ ఎంఆర్టి, శ్రీనివాస్ ఏడిఈ హుజురాబాద్, అంజయ్య ఏడిఈ కన్స్ట్రక్షన్, శ్రీనివాస్ ఏఈ హుజురాబాద్, సిబ్బంది పాల్గొన్నారు.






