
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మండలంలో వరి కోతలు మొదలయ్యాయని, రైతులెవ్వరు రోడ్లపై వరి ధాన్యాన్ని పోయకుండా సహకరించాలని హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ….రైతులు రోడ్లపై దాన్యం పోయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రాత్రిపూట వాహనాలు నడిపే వాహనదారులకు ధాన్యం కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. గతంలో రోడ్లపై ధాన్యం పోయడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణా నష్టం కూడా జరిగిన సంఘటనలు మర్చిపోకూడదని అన్నారు. రైతులు ఎవరు రోడ్లపై ధాన్యాన్ని పోయావద్దనీ ఆయన సూచించారు.

సీఐ తిరుమల్ గౌడ్..




పలుచోట్ల రైతులు ధాన్యాన్ని ఆరబోయగా వారికి కౌన్సిలింగ్ ఇస్తున్న సీఐ తిరుమల్ గౌడ్..





