Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూలులో అత్యుత్తమ పనితనం చూపి రాష్ట్రంలో మొదటి స్థానం నిలిచిన హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్యకు హైదరాబాదులో అచీవర్ అవార్డు లభించింది. గురువారం రాత్రి హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్రస్థాయిలో ఆస్తి పన్ను వసూలు విషయంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 100 శాతం ఆస్తి పన్ను వసూలు చేసినందుకుగాను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు సిడిఎంఏ శ్రీదేవి ప్రశంసా పత్రాన్ని, అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ…హుజురాబాద్ మునిసిపాలిటీ ఆస్తిపన్ను వసూలులో మొదటి స్థానం పొందేందుకు సహకరించిన మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో హుజురాబాద్ ను మొదటి స్థానంలో నిలిపే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.






