
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పాలకవర్గ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద రామాలయంగా పేరొందిన ఇల్లందకుంటకు ఘనమైన చరిత్ర ఉంది.అపర భద్రాద్రిగా పేరొందిన రామాలయంలో బ్రహ్మోత్సవాలకు ముందు ఈ కమిటీ ప్రకటన వల్ల నూతన ఉత్సాహాన్ని నింపారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. ఆలయ చైర్మన్ గా ఇంగిలి రామారావు ను నియమిస్తున్నట్లు,14 మంది డైరక్టర్లుగా కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.


ఆలయ కమిటీ చైర్మన్ రామారావు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ ను కలిసిన దృశ్యం.





