
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ న్యాయవాదుల సంఘం ఎన్నికలలో అధ్యక్ష కార్యదర్శులుగా యతిపతి అరుణ్ కుమార్, ఎర్రోళ్ల రమేష్ లు ఎన్నికైనట్లుగా ఎన్నికల కమిటీ సభ్యులు వెల్లడించారు.
ఎన్నికల కమిటీ సభ్యులు భూమిరెడ్డి, జేమ్స్, అమరేందర్ రెడ్డి, సత్యనారాయణల ఆధ్వర్యంలో ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. అధ్యక్షుడిగా యతిపతి అరుణ్ కుమార్ 6 ఓట్ల మెజారిటీతో బండి కళాధర్ పై ఘన విజయం సాధించాడు. కార్యదర్శిగా ఎర్రోళ్ల రమేష్ తన ప్రత్యర్థులపై 11ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. కాగా ఇప్పటికే ఉపాధ్యక్షుడిగా నూతల శ్రీనివాస్, కోశాధికారిగా బాగోతం కుమారస్వామి, సహాయ కార్యదర్శిగా పిట్టల రాజేష్, లైబ్రరీ సెక్రటరీగా చౌడమల్ల భానుకిరణ్, కల్చరల్ స్పోర్ట్స్ సెక్రటరీగా ఇరుమండ్ల జైపాల్, సీనియర్ ఈసీ మెంబర్ గా బండి రవీందర్, జూనియర్ ఈసి మెంబర్ గా తునికి రవి, లేడీ ఈసి మెంబర్గా శ్రీరామ్ శిరీషలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అరుణ్ కుమార్ కు హుజురాబాద్ కోర్టు న్యాయమూర్తులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

