Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో శనివారం రాత్రి వీర హనుమాన్ విజయయాత్రను స్థానికులు ఎంతో ఘనంగా నిర్వహించారు. డప్పుల మ్రోగింపులు, శోభాయాత్రల సందడి, బాణాసంచా వెలుగులు పట్టణాన్ని కనుల పండువగా మార్చాయి. ‘జై శ్రీరాం’, ‘జై హనుమాన్’ నినాదాలతో హుజురాబాద్ మార్మోగింది. ఆధ్యాత్మికతతో నిండిన దృశ్యాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. బిజెపి, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
విజయయాత్రను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారిలో అంకతి శ్రీనివాస్, నల్ల సుమన్, బండ బాను చందర్, అపరాజ మహేష్, మైసమ్మ బన్నీ, బండ రిషి, మైసమ్మ సందీప్, మహేష్ గౌడ్, రావుల చందు, వేముల రవి తేజ, క్యాస సాయి తేజ, కొలిపాక శ్రీనివాస్, యాళ్ల సంజీవ రెడ్డి, ఆవుల సదయ్యలు పాల్గొన్నారు.









