
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ కల్వరి టెంపుల్ లో చర్చి ఫాదర్ రెవ. డాక్టర్ పి.ఆర్ నెల్సన్ ఆధ్వర్యంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. యేసు మరణించిన రోజును ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే ఆరాదనలు జరుపుకుంటారు. ఈ వేడుకల్లో యేసు సిలువపై పలికిన 7 మాటలను సంఘ సభ్యులు బోదిస్తారన్నారు. 1)బండ ప్రియాంక 2) బండ మాధవి 3)బొడ్డు హర్షవర్ధన్ 4)బండ స్నేహ 5)శనిగరపు ప్రవీణ 6) తిరుగమల్ల కవిత 7) కూచన విష్షునువర్ధన్ లు బోదించారు. 40 రోజుల ఉపవాసం దినముల దీక్ష విరమణలో భాగంగా మాడుగుల ఆశీర్వాదo స్నేహితుడు సురేష్ సుజాత దంపతులు ఫ్రూట్స్ ను, నెల్సన్ పాస్టర్ కుటుంబం నుండి ఎగ్ పప్స్, బండ రమేష్ మాధవి దంపతుల నుండి జ్యూస్ ను సంఘ సభ్యులందరికి అందించారు. ఫాదర్ నెల్సన్ గుడ్ ఫ్రైడే ప్రత్యేక సందేశాన్ని అందించారు. సంఘ క్వయర్ పాటలతో సంఘసభ్యులు కన్నీటితో క్రీస్తును ఆరాధించారు. ఫాధర్ దంపతులు అందరికి ప్రత్యేక ప్రార్తనలు చేశారు.



ప్రత్యేక గీతాలను ఆలపిస్తుండగా డ్రమ్స్, డప్పు వాయిస్తున్న కళాకారులు








పైన సందేశాలిస్తున్న అతిథులు.. క్రింద సంఘ సభ్యులకు కూల్డ్రింక్స్ అందజేస్తున్న దాతలు..