
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ (ఎల్కతుర్తి):హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ పాతికేళ్ళ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు. గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, గులాబీ కార్యకర్తలు తరలిరానున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు. భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయం అనీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి…తెచ్చి చూపించి తొమ్మిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామీగా నిలిపిన ఘనత తమ అధినేత కెసిఆర్ కి దక్కుతుందని వినోద్ కుమార్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని వునోద్ కుమార్ విమర్శించారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలు అయిందని ఆయన అన్నారు. ప్రజా క్షేత్రంలో గెలుపు ఓటములు సహజం అని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తామని వినోద్ కుమార్ పేర్కొన్నారు


సభాస్థలిని, ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్..








