
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం తోకలపల్లి గ్రామంలో మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ కు డీ కొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హుజురాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన దండుగూడెం హరిచరణ్(18), గండ్రకోట రాజశేఖర్ (19) యమహా ఆర్ వన్ ఫై ఇద్దరి యువకులు అతివేగంగా వెళ్లి స్పీడు కంట్రోల్ కాక రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ కు డీ కొట్టి కింద పడడంతో ఇద్దరికీ తలలు పగిలి, కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఇద్దరిని హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో చేర్పించి ప్రథమ చికిత్స అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు.

డివైడర్ కు ఢీకొని రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డ యువకులు..







