
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఎస్సీ ఏ గ్రూపులోని 15 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలనీ హైదరాబాదులో టీజీపీసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు శనివారం బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…స్వాతంత్ర్యం వచ్చి 76సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణలో నివసిస్తున్న బేడ బుడగ జంగాలు అన్ని రంగాలలో వెనుకబడిపోయారని, బేడ బుడగ జంగాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ లో చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో బుడగ జంగాలకు 15 శాతం అవకాశాలను కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు దేవుడు కుమార్, కప్పెర జంగయ్య, పత్తి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.
