
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వార్డు కార్యాలయంలో శనివారం ఆయుష్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం జరిగింది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పోషక్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రక్తహీనత పౌష్టికహారం లోపంతో కలిగే అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్నట్లు బోర్నపల్లి ఆయుర్వేదిక్ డాక్టర్ భూక్యా సరోజ తెలిపారు. ఈ సందర్భంగా యోగ మీద అవగాహన కల్పించారూ ..మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ఆయుర్వేద వైద్య సేవలు సద్వినియోగాం చేసుకోవాలనీ ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ పీహెచ్సీ హెచ్ఈఓ విజయేందర్ రెడ్డి, ఫార్ర్మసిస్ట్ రమేశ్ ,F.N.O మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

బోర్నపల్లి గ్రామం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది…