
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాదులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మరియు పేపర్ ఆటో ఒకదానికి ఒకటి ఢీకొనడం వలన కరీంనగర్ కు చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు మెడపై తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఆటో డ్రైవర్ నాగరాజు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. బైక్ పై గాయపడిన వ్యక్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.







