
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ, (ఎల్కతుర్తి): ఎలుకతుర్తిలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సభ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. సందర్శించిన వారిలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు, మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదారి బాలమల్లు, నాగుర్ల వెంకన్న, వాసుదేవ రెడ్డి, శోభన్ బాబు, వై సతీష్ రెడ్డి, రాకేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, కిషన్ రావు తదితరు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని చింతలపల్లి వద్ద భారీ బహిరంగ సభ పనులను మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లక్షలాదిమంది రాబోవు ఈ సభ కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 15 నెలలు గడిచిన నెరవేర్చకపోవడంతో ప్రజలు అభివృద్ధి పై నిరాశ నిస్పృహతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చరని పూర్తిగా నమ్ముతూన్నారనీ, బిఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వీలైనంతగా వారు ట్రాక్టర్లలో, వ్యాన్లలో బస్సులలో వారికి వారు స్వచ్ఛందంగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్న ప్రజలు సభకు భారీ గా హాజరై సక్సెస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. యావత్ ప్రజానీకం కేసిఆర్ మా భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం సందేశం ఇవ్వబోతున్నారు అని ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచిన ఎటువంటి అభివృద్ధి జరుగుతలేదనీ, మా కాళ్ళను మేమే నరుక్కుని కాంగ్రెస్కు ఓటు వేశామని తీవ్ర మనోవేదనలో ఉన్నారన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వోడితేల సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు రైతు బీమా రైతు భరోసా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. వృద్ధులకు రెండు వేల పెన్షన్ ను 4000 చేస్తామని వికలాంగులకు 4000ల పెన్షన్ 6000 చేస్తామని చెప్పి మరిచిపోయారని ఎద్దేవా చేశారు హామీలు ఇచ్చుడు వరకే కానీ నిలబెట్టుకోవడంలో విఫలమైందని అన్నారు. సభా పనులు వేగంగా జరుగుతున్నాయనీ, సభ కోసం వచ్చే కార్యకర్తలకు అన్ని రకాల సదుపాయాలు చేస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల వాటర్ బాటిల్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. మన రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉన్నదనీ, ఉత్తరకొరియా, అమెరికా, ఆస్ట్రేలియా నుండి ఎన్నారైలు స్వచ్ఛందంగా మేము వస్తామని ఫోన్ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, మండల సీనియర్ నాయకులు తంగేడ మహేందర్, యేల్తూరి స్వామి, తంగేడ నగేష్, పోరెడ్డి రవీందర్ రెడ్డి, కడారి రాజు, గోల్లే మహేందర్, గుండేటి సతీష్ నేత, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, వినయ్ గౌడ్, జూపాక జడ్సన్, సాతూరి శంకర్, మదార్, గోడిశాల విక్రమ్ గౌడ్, పెండ్యాల సుదర్శన్, దుగ్యాని సమ్మయ్య, సాతూరి చంద్రమౌళి, వేముల సమ్మయ్య జ మదన్ మోహన్ రావు, వేముల శ్రీనివాస్, కోరే రాజ్ కుమార్, ఎంకే యాదవ్, దేవేందర్ రావు, బాబురావు, డుకిరే రాజేశ్వర్ రావు, శివాజీ, సతీష్, హింగే రాజేశ్వరరావు, హింగే భాస్కర్, అంబాల రాజ్ కుమార్, శ్రీకాంత్ యాదవ్, చిట్టి గౌడ్, ఉట్కూరి కార్తీక్, భగవాన్ గౌడ్, డెంగు రమేష్, బొంకురి కార్తీక్, నవీన్, అనిల్, మురళి తదితరులు పాల్గొన్నారు.







విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు..