
–విజేతలకు బహుమతులు అందించిన బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు అంకతి శ్రీనివాస్
–టోర్నమెంట్ ఆర్గనైజర్ అల్లం గణేష్, శ్రీరామ హాస్పిటల్ ప్రతినిధులు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి 24: హుజురాబాద్‌లో 20 రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగిన ఎల్పీఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్లో అనేక జట్లు చురుకుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఫైనల్ మ్యాచ్‌లో కె ఎస్-11 జట్టు అద్భుత ఆటతీరుతో విజేతగా నిలవగా, లయన్-11 జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేత కె ఎస్-11 జట్టుకు ట్రోఫీతో పాటు రూ.3,000 నగదు బహుమతి, రన్నరప్ లయన్-11 జట్టుకు ట్రోఫీతో పాటు రూ.2,000 నగదు బహుమతి ప్రదానం చేశారు. బహుమతులను బీజేపీ హుజురాబాద్ పట్టణ ఉపాధ్యక్షుడు అంకతి శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్ అల్లం గణేష్, శ్రీరామ హాస్పిటల్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా అంకతి శ్రీనివాస్, అల్లం గణేష్ మాట్లాడుతూ యువతలో క్రీడాపట్ల ఆసక్తి పెంచే ఈ విధమైన పోటీలు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయనీ, భవిష్యత్తులో మరిన్ని క్రీడాపోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తాం అని తెలిపారు.



విజేతలకు బహుమతులు అందజేస్తున్న బిజెపి ఉపాధ్యక్షుడు అంకతి శ్రీనివాస్..