
– తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రత.. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత
–24 గంటల్లో ఎండ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయిన 11 మంది
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణలో వడదెబ్బతో ఒకే రోజు 11 మంది మృతి చెందారు. 24 గంటల్లో ఎండ తీవ్రతకు ప్రాణాలు కోల్పోయిన 11 మందిలో ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరు, సూర్యాపేట జిల్లాలో ఒక్కరు, నిర్మల్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ఒక్కరు, వరంగల్ జిల్లాలో ఒక్కరు, జనగామ జిల్లాలో ఒక్కరు, ములుగు జిల్లాలో ఒక్కరు ఎండ తీవ్రతను తట్టుకోలేక మృత్యువాత పడ్డట్లు వార్తలు అందాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

