
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టడం కాంగ్రెస్ వారే చేశారని బిఆర్ఎస్ నాయకులు నిందలు వేయడం సరికాదని
కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు టేకుల శ్రావణ్ అన్నారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ…బిఆర్ఎస్ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని, బిఆర్ఎస్ సభను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే మీకు అనుమతులు ఎలా వచ్చేవని అన్నారు. ఇటీవల హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గుండెడు గ్రామం వద్ద క్వారీ యజమానిని బెదిరించి డబ్బులు అడగడంతో అట్టి క్వారీ యాజమాని కేసు పెట్టడంతో ఆ కేసును దృష్టి మల్లించడం కోసం కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయడం విడ్డురంగా ఉందని అన్నారు. బిఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే క్యాంపులో పార్టీ సమావేశాలు నిర్వహించకూడదని తెలియదా అని ప్రశ్నించారు? ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే మీ పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవడం కోసం కాదని నియోజకవర్గ ప్రజల సమస్యలు, ప్రభుత్వ కార్యకలాపాలు కోసం అందుబాటులో ఉంటుందని అంతే కానీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీ పార్టీ ఆఫీస్ కాదని ఇక మీదట క్యాంపు కార్యాలయంలో పార్టీ సమావేశాలు, పత్రిక సమావేశాలు నిర్వహిస్తే అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు టేకుల శ్రావణ్
కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు టేకుల శ్రావణ్