Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
పహల్గంలో ఉగ్రవాదులు పర్యాటకులను కాల్చి చంపడానికి నిరసిస్తూ శనివారం రాత్రి హుజురాబాద్ పట్టణంలోని ఆసుపత్రి ఏరియా వద్ద పలువురు కొవ్వొత్తులతో మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఉగ్రవాదులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సామాజికవేత్త తిప్పారపు శ్రీనివాస్, ఎండి ఇసాక్, సి మంగళం, మహేష్ , ముద్రకోల ఆనంద్, కూడికల అశోక్, మండ సతీష్, వేలూరి గిరిధర్, చందు, భరత్ , రఘు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.






