
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అంత్యక్రియలకు వచ్చిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డ ఘటనతో హుజురాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గండ్రకోట రాజశేఖర్ అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై శుక్రవారం రాత్రి మృత్యువుతో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా హుస్నాబాద్ కు చెందిన ఇస్లావత్ వెంకట్ (40), రాజశేఖర్ అంత్యక్రియలకు శనివారం వచ్చాడు. ప్రతాప్ వాడలోని రాజశేఖర్ ఇంటి సమీపంలోని మురుగు కాలువ లో హఠాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. దీంతో స్థానికులు గమనించి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించే లోగా మార్గమధ్యలో చనిపోయాడు. కాగా ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మిత్రుని అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చి తాను మృతి చెందడం పలువురిని కలచివేసింది. అయితే ఒక్కసారిగా వెంకట్ కళ్ళు తిరిగి రోడ్డు పక్కన ఉన్న మురుగు కాలువలో పడడంతో తలకు తీవ్రమైన గాయమై రక్తస్రావం కావడంతోనే మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు.






రోడ్డు పక్కన మరుగు కారులో పడి తీవ్రంగా గాయపడ్డ ఇస్లావత్ వెంకట్..
– ఆస్పత్రికి తరలిస్తున్న మార్గమధ్యలో మృతి చెందిన దృశ్యం.

వెంకట్ ఫైల్ ఫోటో..





