
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ లో అదనపు జిల్లా కోర్టు కోసం హుజూరాబాద్ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు యతిపతి అరుణ్ కుమార్ అధ్వర్యంలో బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు వెళ్లి ఆయనను సన్మానించారు. అనంతరం వినతి పత్రం అందజేయగా కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించి హైకోర్టు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి *అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే హుజురాబాద్ బార్ అసోసియేషన్ ను సందర్శిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎర్రోళ్ రమేష్, ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, సీనియర్ న్యాయవాది నల్ల భూమిరెడ్డి న్యాయవాది వంశీ కృష్ణ పాల్గొన్నారు.

వినతిపత్రం ఇస్తున్న న్యాయవాదులు..





