Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కాకతీయకాలనీకి చెందిన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకుడు, పాత్రికేయుడు పాకాల రవీందర్ రెడ్డి మాతృమూర్తి పాకాల మాణిక్యమ్మ ఇటీవల మృతిచెందగా వారి గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రవీందర్ రెడ్డినీ,అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాణిక్యమ్మ మృతి చెందిన తీరును రవీందర్ రెడ్డిని అడిగి తెలుసుకుని వారికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.






