Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి, సిరిసిల్ల: కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పట్టుబడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏర్రంరెడ్డి అమరేందర్ రెడ్డిని కరీంనగర్లోని విద్యారణ్యపురిలో గల తన నివాసంలో రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ మండలం అవునూరు మరియు అగ్రారాం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణం కోసం కాంట్రాక్ట్ పనికి సంబంధించిన రూ.50 లక్షల బిల్లును మంజూరు చేయడానికి రూ.60 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పకడ్బందీగా వల పన్నీ పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏసిబి డిఎస్పి వివరించారు.

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సిరిసిల్లలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి

పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వివరిస్తున్న లేఖ





