
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బహుజన సమాజ్ పార్టీ మండల నాయకులు కండె తిరుపతి, ధర్మసమ్మాజ్ పార్టీ మండల నాయకులు మందరాజు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గౌతమ బుద్ధుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బుద్ధుడి చిత్రపటానికి పూలమాలవేసి, కేక్ కట్ చేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గౌతమ బుద్ధుని జయంతి…
2569 జయంతిని బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలో హుజురాబాద్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక విప్లవకారుడు గౌతమ బుద్ధుడు. బుద్ధం శరణం గచ్చామి ధర్మం చరణం గచ్చామి సంగం శరణం గచ్చామి ప్రపంచమంతా తిరిగి బుద్ధుడు బోధించడం తప్ప ఏ గ్రంధాలు రాయలేదు కష్టాలు తీరాలంటే మానవ కోరికలు చంపుకోవాలి జ్ఞానం పెంచుకోవాలి అష్టాంగ మార్గాన్ని పాటించాలి హింస విడనాడాలి మానవులు ఒకరికొకరు ద్వేషించుకోకూడదనీ పంచ సూత్రాలు పాటించాలన్నారు. ప్రేమానురాగాలు పంచుకోవాలని మానవులంతా సమానులే ప్రపంచమంతా తిరిగి భిక్షాటన చేసి తన బోధనలను ప్రచారం చేశాడు.సరి అయిన పని సరి అయిన ఘర్షణ సరియైన బోధనలు ఇంకా ఎన్నో ప్రచారం సాధనలు ఉపయోగించారు ప్రజలను చైతన్యవంతులు చేశారు. బుద్ధ జయంతి కార్యక్రమంలో mif కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రత్నం, Mif హుజురాబాద్ డివిజన్ ట్రెజరర్ మట్టెడ ప్రకాష్, డీఎస్పీ మండల అధ్యక్షుడు మంద రాజు, బీఎస్పీ మండల అధ్యక్షుడు కండె తిరుపతి, తడకమళ్ళ శేఖర్, కలవల సంపత్, దాట్ల ప్రభాకర్, వేల్పుల భాస్కర్, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



గౌతమ బుద్ధుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నాయకులు..





