
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తెలంగాణ వచ్చిన తొలి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా వారు నిర్వహించిన బాధ్యతల వల్ల నేడు అనుభవిస్తున్న తెలంగాణ ప్రజల గోస వారికే చెందుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు. కేసీఆర్ పై యుద్ధం చేస్తానని చెప్పి ఆలయ భూములను ఆక్రమించిన కేసులో ఎక్కడ జైల్లోకి వెళ్లాల్సి వస్తుండోనని భారతీయ జనతా పార్టీలోకి మారి బాగా మాసిన బురద బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తే ఎలా తెల్లబడతాయో బిజెపి పార్టీలో మారిన తర్వాత నేను అలానే ఉన్నాను అని భ్రమ పడుతున్నాడన్నారు. నాపైన ఎటువంటి అవినీతి మరకలేదు అని నేడు రాష్ట్ర అభివృద్ధికి గడిచిన కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో గాడిది గుడ్డు సున్నా ప్రవేశపెడుతోంది తెలంగాణ ప్రజలు గమనిస్తున్న తీరును వారు ఎలా మభ్య పెట్టాలో తెలియక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బురదజల్లే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులపై గట్టిగా మాట్లాడి దమ్ము ధైర్యం ఉంటే నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరొక మారు ముఖ్యమంత్రి పై గాని రాష్ట్ర మంత్రులపై గాని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే మా యూత్ కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని రోడ్ల మీద తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తున్నామన్నాడు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంజాల అరవింద్, యూత్ మండల ఉపాధ్యక్షులు మేకల రాజ్ కుమార్, చల్లురి విష్ణువర్ధన్, సంపంగి అరుణ్, ప్రధాన కార్యదర్శి పంజాల రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు గోస్కుల మధుకర్, బన్నీ, సంపత్, ఏనుగుల బన్నీ, కృష్ణంరాజు, సాయి, అజయ్, ప్రదీప్, జాన్సన్, సాయి, హర్ష, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




