
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అసెంబ్లీలో ఆమోదం పొందిన స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ఆ తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఏవో కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిలుకమారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని వారి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలైన స్థానిక సంస్థల్లో 42% శాతం వాటా, ముత్వ సివిల్ కాంట్రాక్టులు మెయింటినెన్స్ కాంట్రాక్టుల్లో 42% వాటా, ప్రతి సంవత్సరం 20వేల కోట్ల బడ్జెట్, ఎంబీసీ మంత్రిత్వ శాఖ, పరిపూర్ణమైన రియంబర్స్మెంట్, తెలంగాణ ఫిషరీస్ బోర్డ్, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సబ్ ప్లాన్, మండలానికి ఒక గురుకుల పాఠశాల, ప్రతి జిల్లాకు డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్రంలో వృత్తి బజార్లు ఇస్తామని హామీ ఇచ్చారని వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో 42% వాటా పెంచాలని, ఈ రాష్ట్రంలో కులగనన చేయాలని అనేక పోరాటాలు చేశామని బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష చేశారని ఈ పోరాటాల ఫలితంగా అసెంబ్లీలో బిల్లులను తీర్మానం చేశారని వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు సీలింగ్‌ను సాకుగా చూపుతు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అమలు చేసే అధికారం ఉన్న తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కానీ వారు ఎన్నికల హామీలో కుల గణన ఆధారంగా, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారని కానీ నేడు 9వ షెడ్యూల్లో పెట్టాలని దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించారు. శాంతియుత పద్ధతిలో నేడు అధికారికి వినతి పత్రాన్ని ఇచ్చి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎమ్మార్వో, ఎంపీడీవో, కలెక్టర్ ఆఫీసులలో బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకురాలు బింగి రాణి, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు తాడూరి మల్లేష్ గౌడ్, హుజురాబాద్ మండల ఉపాధ్యక్షుడు ముప్పు కోటి రజక తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయ ఏఓ కి వినతి పత్రం అందజేస్తున్న బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, ఇతర నాయకులు





