
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,మే26:
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని పోచమ్మ దేవాలయ సమీపంలో సోమవారం విద్యుత్ ఘాతానికి గురై గేద మృతి చెందింది. గొల్లవాడకు చెందిన సింగరవేణి శ్రీనివాస్ కు చెందిన గేదను మేత కోసం విడిచిపెట్టగా మేత మేస్తూ ట్రాన్స్ ఫారం దగ్గర విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందింది. గేద విలువ సుమారు ఒక లక్ష రూపాయల వరకు ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. పాలు ఇచ్చే గేద మృతి చెందడంతో జీవనోపాధి కోల్పోతున్నామని ప్రభుత్వం పరంగా నష్టపరిహారం ఇప్పించాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు.






