
మహిళలకు తండ్రి అస్థిలో సమాన వాటా హక్కుల ప్రధాత..
ఎన్టీఆర్ కు భారత రత్న
అవార్డు ఇవ్వాలి…తెలుగు ప్రజలకు మహానాడు శుభాకాంక్షలు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
సినిమా రంగంపై తనదైన ముద్ర వేసి, క్షణం తీరికలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం నాటి కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే లక్ష్యంతోనే నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. ఎన్టీఆర్ సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాలలో కూడా జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తి సాధించారని తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చెప్పి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకి దక్కిందని,
ఇది దేశ రాజకీయ చరిత్రలోనే లిఖించదగిన పరిణామం అని రామారావు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నేటినుంచి నిర్వహిస్తున్న మహానాడు ,
బుధవారం స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు102 వ జయంతిని పురస్కరించుకొని నేడిక్కడ మీడియా ప్రతినిధుల తో రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడారు. అన్ని వర్గాల పేద ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వ అధినేతగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెన్నిధిగా అన్నగా ఎన్టీఆర్ నిలిచారని కొనియాడారు. మహిళలకు ఆస్తిలో సమాన వాటాహక్కు, పేద వాడి తిండి కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం, కట్టుకోవడానికి సగం ధరకే జనతా వస్త్రాలు కల్పించి ఉండటానికి పక్కా గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అమలు చేశారన్నారు, పేద పిల్లల చదువు కోసం రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు తొలుత ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆరే నాంది పలికారని, తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్స్ లో తెలుగు లలితా కళాతోరణం ఏర్పాటు,అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, మహిళల కోసం తిరుపతి లో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గతంలో ఇరుకుగా ఉన్న టాంక్ బండ్ రోడ్డు ను వెడల్పు చేసి ట్యాంకు బండ్‌పై మహనీయుల చరిత్ర కారుల విగ్రహాలు, బషీర్ బాగ్ చౌరస్థాలో బాబూజగ్జీవన్ రాం విగ్రహ ఏర్పాటు ,హుస్సేన్‌సాగర్‌లో అతిపెద్ద బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో దేశంలోనే తొలిసారి బీసీ, ఎస్సీ, ఎస్టి లకు మహిళలకు రిజర్వేషన్లు ఎన్టీఆర్ కల్పించి అమలు చేసి శ్రీకారం చుట్టి దేశానికే మార్గ దర్శకులు అయ్యారని రామారావు కొనియాడారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించటానికి హైదరాబాదు లో నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది ఎన్టీఆర్ హయాంలో నే నని,
,హైదరాబాద్ లో గౌలిగూఢ ఇమ్లిబిన్ లో సువిశాల మహాత్మా గాంధి బస్ స్టేషన్, సికింద్రాబాద్ లో జూబ్లీబస్ స్టేషన్, విజయవాడ లో పెద్ద ఆర్టీసీ బస్ స్టేషన్లు ఎన్టీఆర్ హయాంలో నిర్మించినవే అని అన్నారు.
హైదరాబాద్ లో మతకల్లోలాలు అరికట్టి గుండాయిజాన్నీ నిర్మూలించి శాంతి భద్రతలు కాపాడి మత సామరస్యం నెలకొల్పిన ఘనత ఎన్టీఆర్ కే దక్కిందన్నారు, ఎన్టీఆర్ సీఎం గా ప్రోటోకాల్ పక్కకు పెట్టీ తన సొంత కారు, అబిడ్స్ లోని సొంత ఇంటినే వాడుకొని జీతం తీసుకోకుండా నిరాడంబరంగా గడిపి నిజాయితీ గా నిలిచి అవినీతి రహిత పాలన కొనసాగించి,రైతులకు అనేక నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టారని, తిరుమల లో తొలిసారిగా ఎన్టీఆర్ నిత్యాన్నదాన ప్రాజెక్టు చేపట్టి ప్రతి రోజు వేలాది మంది భక్తులకు నాణ్యమైన ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారన్నారు.
అణగారిన బడుగు బలహీనవర్గాల సామాన్యుల ప్రయోజనాల కోసం తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు నేతృత్వంలో1982 మార్చ్ 29న హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించి తెలుగు దేశం పిలుస్తోంది రా కదలిరా అనే నినాదంతో యువతలో మహిళల్లో సామాన్యుల్లో చైతన్యం రగిలించి 9 నెలల్లోనే అధికారం లోకి వచ్చి చరిత్ర సృష్ఠించిందని, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో ప్రజలే దేవుళ్లుగా ఎన్టీఆర్ భావించి రైతుల,బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన ఎనలేని సేవలు చిరస్మరణీయం అని పోలాడి రామారావు పేర్కొన్నారు. యువతరం, కార్మిక కర్షక , మహిళ,ఉద్యోగుల్లో
బీసీలలో , ఎస్సీ ,ఎస్టీ ల్లో రాజకీయ చైతన్యం తెచ్చిన రాజకీయ సంస్కర్త మహనీయుడు ఎన్టీఆర్ నేటి తరం వారికి ఆదర్శప్రాయుడు గా నిలిచారని పొలాడి రామారావు కొనియాడారు
దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తెలుగు దేశం స్థాయిలోప్రజలను ప్రభావితం చేయలేదని,జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగు దేశం పార్టీ మాత్రమేనని అన్నారు.
తెలంగాణా లో భూస్వామ్య, బడా బూర్జువా పెత్తందారి వ్యవస్థకు చరమ గీతం పాడి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దుచేసి,రైతులకు భూశిస్తు పూర్తిగా మాఫీ చేసి, రైతులకు సింగిల్ విండో సహకార సంఘాల ఏర్పాటు చేసి స్వల్పకాలిక రుణాల పై సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ మాఫీ చేయడం, సబ్సిడీ మీద వ్యవసాయ యంత్ర పరికరాలు, విత్తనాలు ఎరువులు అందించి రైతులకు రాయితీతో నాణ్యమైన విద్యుత్ సౌకర్యం కల్పించడం లాంటి అనేక సాహసోపేతమైన, విప్లవాత్మక నిర్ణయాలెన్నో ఆయన తీసుకున్నారని అన్నారు.
పంచాయతి సమితి వ్యవస్థలను రద్దు చేసి, ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలన్న మంచి ఉద్దేశంతో మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేశారని రామారావు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం తో రోడ్లు నిర్మించి ప్రజా సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజల వద్దకే పాలన తెచ్చారన్నారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దళిత వర్గానికి చెందిన కాకి మాధవరావు ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా, మహేంద్ర నాథ్ ను ఆర్థిక మంత్రి గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా జీఎంసి బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా ,బీసీ వర్గాలకు చెందిన దేవేందర్ గౌడ్ ను కీలకమైన రెవెన్యూ హోమ్ మంత్రి గా ,ఎర్రo నాయుడును కేంద్ర కేబినెట్ లో గ్రామణాభివృద్ధి శాఖా మంత్రి గా పని చేసే అవకాశం తెలుగు దేశం పార్టీ కల్పించి సామాజిక సమన్యాయం చేసిందని రామారావు అన్నారు.
తొలి సారి 1983 లో సీఎం గాఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మర్యాద పూర్వకంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కలవడానికి ఢిల్లీ కి పోగా ఆయనకు అధికారులు ఢిల్లీలో తమిళనాడు భవన్ లో బస ఏర్పాటు చేయగా ఇదేమిటి మనకు ఏపీ భవన్ లేదా అని ఎన్టీఆర్ అధికారులను అడిగితే ఆ భవన్లో ఉత్తర ప్రదేశ్, బీహార్ కాంగ్రెస్ నాయకులు,గుండాలు ఆక్రమించుకొని వసతి పొందుతున్నారని వారిని ఖాలీ చేయించడం ఇబ్బంది గా ఉందని చెప్పగా 48 గంటల్లో ఖాళీ చేయించాలని ఎన్టీఆర్ హుకుం జారీ చేసిన విషయం అధికారులు ప్రధాని ఇందిరా గాంధీకి తెలపడం తో బెంబేలెత్తిన పీఎం కార్యాలయం స్పందించి మిలటరీ సహాయంతో వారిని ఖాళీ చేయించి ఏపీ భవన్ ను ఏపీ ప్రభుత్వ అధికారులకు అప్పగించడం తో ఎన్టీఆర్ శాంతించారన్నారు.అప్పటి వరకు మనల్ని మదరాసీవాళ్లగా చూసి ఢిల్లీ లో గుర్తింపు లేక పోగా ఎన్టీఆర్ తో తెలుగు వారికి గుర్తింపు లభించి డేరింగ్ దక్షణాది తెలుగు వారి ముఖ్యమంత్రి గా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించి ఆంధ్ర ప్రదేశ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిందన్నారు.
ఎన్టీఆర్ పరిపాలనను చూసి ఓర్వలేక ఆనాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు 1984 లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేయగా, ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా పోరాటంతో నెల రోజులకే మళ్లీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పోరాటంలో రాష్ట్రం లో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి,ఎన్ గిరిప్రసాద్, ఓంకార్, సీతారాంఏచూరి లు ఎన్టీఆర్ కు వెన్నంటి ఉన్నారని, జాతీయ స్థాయిలో వాజపేయి, ఎల్ కె అద్వానీ,దేవీలాల్, జగ్ జీవన్ రామ్,బీజు పట్నాయక్, చంద్ర శేఖర్, జ్యోతీ బసు, హెచ్. ఎన్ బహుగుణ చండ్ర రాజేశ్వరరావు.
రామకృష్ణ హెగ్డే, కరుణానిధి, ఫరూక్ అబ్దుల్లా, మేనకాగాంధీ లాంటి నేతలు ఎన్టీఆర్ కు మద్దతు గా నిలిచి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కేంద్ర ప్రభుత్వ, అప్రజాస్వామిక వైఖరిని తీవ్ర స్థాయిలో ఎండగట్టారని పోలాడి రామారావు అన్నారు.
1984 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన లోకసభ ఎన్నికల్లో బలమైన సానుభూతి పవనాలు వీచి కాంగ్రెస్ పార్టీ 400 కు పైగా లోక్ సభ స్థానాలు గెలుపొంది ప్రతి పక్షాలన్నీ తుడుచుకు పోగా బీజేపీ కేవలం రెండు సీట్లు అందులో ఒకటి ఎన్టీఆర్ మద్దతు తో హనుమకొండ లో బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పీవీ నరసింహారావు పై గెలుపొందగా, తెలుగు దేశం పార్టీ 30 లోక్ సభ సీట్లు సాధించి లోక్ సభ లో ప్రధాన ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్రను భేషుగ్గా పోషించిందన్నారు
.దేశంలోని ప్రతి పక్షాలను ఒక్కటి చేసి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ జాతీయ స్ధాయిలో బలమైన నేత గా కాంగ్రెస్ పార్టీకి కంటిలో నలుసులా నిలిచారన్నారు
ఆ తరువాత జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కోసం నాయకులు, పార్టీ కార్యకర్తల ఆకాంక్ష మేరకు 1995 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, తెలుగు దేశం పార్టీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు ప్రజల ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జాతీయ భావాలతో విశేష కృషి చేశారని రామారావు అన్నారు.
తెలుగు దేశం పార్టీ తరపున ఎం ఎల్ ఏ లు గా మొదటిసారి గెలిచిన కేసీఆర్ ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీ తరపున మొదటిసారి ఎంఎల్ఏ గా గెలుపొందిన వారేనని రామారావు గుర్తు చేశారు. ఒక రకంగా నవతరం రాజకీయ నాయకులను తీర్చి దిద్దే ఫ్యాక్టరీగా తెలుగు దేశం పార్టీకి పేరుందని, ఎందరో బడుగు బలహీనవర్గాలకు చెందిన సామాన్య యువకులకు, గ్రాడ్యుయేట్లకు, అడ్వకేట్లకు రాజకీయాల్లో అవకాశం కల్పించి ప్రజా ప్రతినిధులుగా తెలుగు దేశం పార్టీ గెలిపించిందన్నారు. కార్యకర్తల బలం తెలుగు దేశం పార్టీ కి పెట్టని కోట అని కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ జాతీయ ప్రథాన కార్యదర్శి నారా లోకేష్ 5 లక్షల జీవిత భీమా కల్పించడం మంచి పరిణామమన్నారు.
యావత్ తెలుగు ప్రజల అభ్యున్నతి, వారి శ్రేయస్సే తెలుగు దేశం పార్టీ లక్ష్యంగా పనిచేస్తుండటం మమ్ములను ఎంతో ఆకర్షించిందని పోలాడి రామారావు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనాలుగు దశాబ్దాలకు పైగాఎన్ని ఆటు పొట్లు ఎదురైన నేడు కార్యకర్తల బలంతోచెక్కు చెదరకుండా ఉండి నేడు కడపలో మహానాడు పండుగ జరుపు కోవడం తెలుగు ప్రజలు తమ్ముళ్ళు సంతోషం వ్యక్తంచేస్తున్నారన్నారు.
తెలుగు దేశం నాయకులకు, కార్యకర్తలకు,ప్రజాప్రతినిధులకు, తెలుగు ప్రజలందరికీ పోలాడి రామారావు మహానాడు వేడుక పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం, రైతాంగ శ్రేయస్సు కు, తెలుగు జాతి వికాసం కోసం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ఇవ్వాలని పోలాడి రామారావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న రామారావు …





