
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సర్పంచులు గతంలో గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులను చెల్లించకుండా మాజీ సర్పంచ్ లను వేధింపులకు గురి చేస్తుందని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్ ఆరోపించారు. మంగళవారం రంగాపూర్ మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్ హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీ బిల్లులు 153 కోట్లు 10 లక్షల వరకు ఉన్న 9990 బిల్లులు చెల్లించినట్టు అలాగే s d f గ్రాంట్ 85 కోట్లు చెల్లించినట్టు పత్రికల ద్వారా ప్రగల్బాల్ పలికిందన్నారు. సర్పంచ్ల బిల్లులు చెల్లిస్తే ముందస్తు అరెస్టులు ఎందుకు అని పేర్కొన్నారు. చెల్లించిన బిల్లులు కేవలం పంచాయతీ కార్యదర్శులు చిన్న చిన్న పనులు చేసి పెట్టుకున్న వాటిని చెల్లించి సర్పంచులకు చెల్లించినట్టు ఆర్భాటం ప్రచారం చేసుకుంటుందనీ ఆరోపించారు. మాజీ సర్పంచులకు సంబంధించి ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క రూపాయి చెల్లించకపోగా అరెస్టులు, ముందస్తు అరెస్టులు అంటూ మాజీ సర్పంచ్లను మానసికంగా, ఆర్థికంగా కుంగ తీసే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో పని చేసిన వాటికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని చెల్లిస్తూ కిందిస్థాయి గ్రామ స్థాయిలో మౌలిక వసతులు కల్పనలో భాగంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పనులకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంది అన్నారు. అసలు బిల్లులు చెల్లిస్తారా చెల్లించరా అనే గందరగోళ పరిస్థితుల్లో సర్పంచులు మానసిక ఆందోళన చెందుతున్నారన్నారు. హెచ్డిఎఫ్ గ్రాంట్ కింద చెల్లించిన 85 కోట్లు గతంలో మేము చేసిన పనులకు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పనులకు మాత్రమే చెల్లించారన్నారు. గత సర్పంచులు చేసిన పనులు పనులు కావా అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. మా బిల్లులు చెల్లించినప్పుడు మేము వేసిన రోడ్లను మేం వేసిన హైమా స్ లైట్లను గ్రామపంచాయతీ భవనాలను మురుగు కాలువలను ఇలా వాడుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామన్నాడు. కాగా అరెస్ట్ అయిన వారిలో రాంపూర్ మాజీ సర్పంచ్ చేరాల మనోహర్, ధర్మరాజుపల్లి మాజీ సర్పంచ్ పాకాల లక్ష్మారెడ్డి, వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్ తిరుమల తిరుపతి, కాట్రపల్లి మాజీ సర్పంచ్ కాసగోని నిరోషా కిరణ్ ఉన్నారు.


హుజురాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన మాజీ సర్పంచులు..