
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, అన్ని పార్టీలతో జేఏసీ ఐక్య కార్యాచరణ, కవులు, కళాకారులు రచయితలు, మహిళల బతుకమ్మ బోనాలు కోలాటాలు వంటా వార్పు, యువకుల బలి దానాలు, ఉద్యోగుల పెన్ డౌన్, ఆర్టీసీ విద్యుత్, బొగ్గుగనుల కార్మికుల సహాయ నిరాకరణ, రైలు రోకో, కేసీఆర్ ఆమరణ దీక్షతో స్వరాష్ట్ర సాధనకు ఉవ్వెత్తున ఉద్యమించిన యువత విద్యార్థుల ఆందోళనలతో రాష్ట్రంలో పరిపాలన స్తంభించడంతో ఉర్రూతలూగించిన తెలంగాణ రాష్ట్ర సాధన నిరంతర అలుపెరుగని ఉద్యమాలతో అనేక ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ రెండున ఏర్పడిందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా వన్నారం గ్రామంలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో
పోలాడి రామారావు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రాష్ట్రము ఏర్పడి 2024 జూన్ రెండుకు 10 సంవత్సరాలు పూర్తిచేసుకొని, 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని పోలాడి విచారం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామిక స్వభావానికి బదులుగా, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా,నియంతృత్వ అహంకార పోకడలతో సాగిన గత ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పారదర్శకత లోపించిందని, జవాబుదారీ తనం లేదని, అభివృద్ది సూచికలో పక్క రాష్ట్రాల కంటే వెనుక బడి పోయామని పోలాడి రామారావు ఆందోళన వ్యక్తం చేశారు.
సహజ వనరులు ఉన్నా అవి స్థానిక ప్రజల చేతుల్లోకి వెళ్లడం లేదని, ఇసుక మాఫియా రాజ్యమేలుతుందని, సంక్షేమ పథకాల అమలులో అర్హులకు న్యాయం చేయాలని, ఎస్సీ ఎస్టీ చట్టం సబ్ ప్లాన్ అమలు చేయాలని, బీసీలకు, వివిధ కార్పొరేషన్ లకు కేటాయించిన నిధులనుఆయా వర్గాల సంక్షేమానికే వెంటనే ఖర్చు చేయాలని, రాష్ట్రంలో కొత్త సంస్థలు కొత్త పరిశ్రమలు రావాలని, స్థానికులకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించి, రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందనీ మానవాభివృద్ధికి అడుగడుగునా అనారోగ్యపరంగా మరణాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరంలో పంట ఉత్పత్తులు పెరుగుతున్నా కానీ రైతుల కుటుంబాల ఆదాయం పెరగడం లేదని, కౌలు రైతుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో అవినీతిపెరుగుతుందని
అవినీతి అధికారుల మీద ఏసీబీ దాడులు చేసినా అవినీతి తగ్గడం లేదని, అవినీతి అధికారులను బర్తరఫ్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పారదర్శక పాలన సాగించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్ధానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారులను తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ బహుజనులు ఆశించిన బంగారు తెలంగాణకు బాటలు వేయాలని, ఇందుకు అంది వచ్చిన చక్కటి అవకాశంగా ప్రస్తుత పాలకులు ఈ దిశగా అడుగులు వేయాలని ప్రజా సంఘాల తరపున పోలాడి రామారావు విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. అంతకు ముందు తన స్వగ్రామమైన మానకొండూర్ మండల పరిధిలోని వన్నారం గ్రామ పంచాయతి కార్యాలయ ఆవరణలో, గ్రామ ప్రధాన చౌరస్తాలో వేర్వేరుగా ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్బంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పోలాడి రామారావు పాల్గొని గ్రామ పంచాయతి ఉద్యోగులకు, హాజరైన పాఠశాల ఉద్యోగులకు సిబ్బందికి, గ్రామ ప్రజలకు రామారావు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేశారు.

జాతీయ జెండా ఎగరవేస్తున్న పోలాడి రామారావు..

జాతీయ జెండాకు వందనం చేస్తున్న రామారావు, ఇతరులు..

గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న రైతు సంఘం నేత పోరాడి రామారావు..

జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న రామారావు తోపాటు గ్రామస్తులు..





