
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంత క్రీడాకారులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడే మిని స్టేడియంను రాకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని, దీంతో క్రీడాకారులకు నష్టమని ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు, బిఆర్ఎస్ నాయకుడు కొలిపాక సమ్మయ్య అన్నారు. ఆదివారం హుజురాబాద్ లో ఆయన మాట్లాడుతూ…
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఎల్ సిగా, విప్ గా పనిచేసిన ప్రస్తుత యంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారుల భవిషత్తు కోసం 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే మినీ స్టేడియంలో మంజూరు చేయించారని, కేవలం మంజూరే కాకుండా పనులు ప్రారంభించి కొంత నిర్మాణం కూడా జరిగిందని ప్రభుత్వం మారడంతో ప్రజలకు కౌశిక్ రెడ్డికి పేరు రావద్దని ఉద్దేశంతో కాంట్రాక్టర్కు బిల్లులు రాకుండా అడ్డుకున్నారని అన్నారు. బిల్లులు రాక కాంట్రాక్టర్ మిగతా పనులు చేయకుండా ఆపారని అన్నారు. కానీ ఈ ప్రాంత అభివృద్ధి ఇష్టం లేని కాంగ్రేస్ నాయకులు ఇప్పుడు రూ. 10 లక్షలతో వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేసి మినీ స్టేడియం ఏర్పాటును అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత క్రీడాకారులు ప్రజలు స్టేడియం నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ పోటీచేసి ఓడిపోయిన కాంగ్రేస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్ బాబు తనను తిరస్కరించిన ఈ ప్రాంత ప్రజలపై కక్ష తీర్చుకొనేందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీలో ఉండి హుజురాబాద్ కాంగెస్ పార్టీ ఇంచార్జ్ గా వున్నా రాజకీయ విద్యార్థి ప్రణవ్ బాబుకి చేతనైతే మినీ స్టేడియoకి మంజూరైన 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం నుండి విడుదల చేయించి స్టేడియాన్ని నిర్మించేందుకు కృషి చేయాలిగాని ఓట్ల రాజకీయాలు చేయడమెందుకని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్ లో మినీ స్టేడియం నిర్మించాలని ఈ ప్రాంత క్రీడాకారులు అప్పటి టిడిపి ప్రభుత్వ హయాం నుండి రెండేళ్ల క్రితం వరకు ప్రతి నాయకులను వేడుకునేవారని అన్నారు. గతంలో ఇదే హైస్కూల్ గ్రౌండ్లో మినీ స్టేడియం కోసం శంకుస్థాపనలు సైతం జరిగిన విషయం ఈ ప్రాంత ప్రజలకు తెలుసని అన్నారు. కానీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం ప్రజల క్రీడాకారుల కోరిక తీర్చడం కోసం అప్పటి సీఎం కేసీఆర్ వద్ద ప్రజల కోరిక తెలిపి 10 కోట్లు మంజూరు చేసి క్రీడాభివృద్ధికి కృషి చేశాడని ఆయన అన్నారు. మిని స్టేడియం చరిత్ర తెలివని ప్రణవ్ బాబు కౌశిక్ రెడ్డిపై కోపంతో క్రీడాకారులకు నష్టం చేస్తూ 10 లక్షల వాకింగ్ ట్రాక్ పనులను ప్రారంభించాడని అన్నారు. మినీ స్టేడియం కాంట్రాక్టు పనులు పూర్తిగా రద్దు కాకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి అదే స్థలంలో కేవలం 10 లక్షలతో వాకింగ్ ట్రాక్ పనులు ప్రారంభించడం ఏమిటని ఆయన పేర్కొన్నారు. నిజంగా ప్రణవ్ బాబుకు హుజురాబాద్ అభివృద్ధి పట్ల ప్రేమ ఉంటే మినీ స్టేడియం కు మంజూరైన 10 కోట్లకు మరో కోటి రూపాయలు అదనంగా మంజూరు చేయించి మరిన్ని సౌకర్యాలు స్టేడియంలో కల్పిస్తే బాగుండేదని ఆయన అన్నారు. ప్రభుత్వ పనులను ప్రణవ్ బాబు ఏ హోదాతో ప్రారంభిస్తారని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి చేయడంలో నిధులు తేవడంలో కౌశిక్ రెడ్డితో ప్రణవ్ బాబు పోటీ పడాలి తప్ప వచ్చిన నిధులను వెనక్కి వెళ్ళే విధంగా కుట్ర చేయడం, ఏ హోదా లేకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన రాదనే విషయం ప్రణవ్ బాబుకు తెలియదా..? అని ఆయన అన్నారు. మునిసిపల్ అధికారులు సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రణవ్ బాబును ఎలా పాల్గొన నిస్తారని, అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ పదవులు లేని వారిని అధికారులు ఎలా అనుమతిస్తారని, మరోసారి ఇలా జరిగితే అనుమతించిన అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి టిఆర్ఎస్కే పట్టం కడతారని సమ్మయ్య పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న కొలిపాక సమ్మయ్య..





